స్వర్ణసాగరం-తొట్టంబేడు,

శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద అర్హులైన బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పర్యవేక్షణలో ఆయన సతీమణి బొజ్జల రిషితమ్మ చెక్కులు అందజేశారు. పూడి గ్రామానికి చెందిన చెరుకు మణి నాయుడు కుమారుడు చెరుకు పవన్ నాయుడుకి రూ.1,38,000, దిగువ కొనతనేరి గ్రామానికి చెందిన సండ్ర ప్రసాద్ నాయుడు సతీమణి సండ్ర పావనికి రూ.81,000, చియ్యవరం గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు రూ.55,000, ఇలగనూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చెరుకూరి మధు నాయుడుకి రూ.55,000 విలువైన చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, పాముకాటు, విద్యుత్ షాక్ వంటి ఘటనల్లో బాధితులైన కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం అభినందనీ యమని గ్రామ ప్రజలు చెప్పారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి ముందడుగు వేస్తున్నారని వారు ప్రశంసించారు.
ఈ సందర్భంగా కొనతనేరి గ్రామంలో రిషితమ్మకు గ్రామస్థులు శాలువాతో ఘనంగా సన్మానించి చెక్కులు స్వీకరించారు. అనంతరం గ్రామ ప్రజలు స్కూల్ భవనం నుంచి హరిజనవాడ వరకు రోడ్డు నిర్మాణం, హరిజన వాడలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు, హరిజనవాడ నుంచి స్మశానం వరకు రహదారి కోసం అవసరమైన భూమిని కొనుగోలు చేసి రోడ్డు నిర్మించాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన బొజ్జల రిషితమ్మ త్వరలోనే అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి మురళి నాయుడు, గాలి సుధాకర్ నాయుడు, పాళెపు మురళి నాయుడు, రాజేంద్ర నాయుడు, రాడవరం చంద్రశేఖర్ నాయుడు తదితర నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



