ePaper
Wednesday, June 3, 2026
Homeఆంధ్రప్రదేశ్భవిష్యత్ తరాలకు త్రాగునీటి కొరత లేకుండా చెయ్యాలి - డి. ఈ  నందకుమార్

భవిష్యత్ తరాలకు త్రాగునీటి కొరత లేకుండా చెయ్యాలి – డి. ఈ  నందకుమార్

📰 Generate e-Paper Clip

స్వర్ణసాగరం  వాకాడు

భవిష్యత్ తరాలకు త్రాగునీరు కొరత రాకుండా కాపాడాలని  డి. ఈ  నందకుమార్  అన్నారు. వాకాడు మండల పరిధిలోని కాశీపురం పంచాయతీ లో  గ్రామ సర్పంచ్  వేమిరెడ్డి  మమత అధ్యక్షతన జల్ అర్పణ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ,  కేంద్ర ప్రభుత్వం  2019లో ప్రతిష్టత్మాకంగా చేపట్టిన  జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించాలని లక్ష్యంగా పనిచేసారని  దానిలో భాగంగా  జల్ అర్పణ్ దివస్ అనే కార్యక్రమాన్ని  ప్రవేశపెట్టి  పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం నుంచి స్థానిక సమాజానికి  గ్రామ పంచాయతీలు  త్రాగు నీరు  వృధా కానివ్వకుండా  ఈ కార్యక్రమం ద్వారా నీటి వనరులు తమవే అనే భావనను  గ్రామస్థులలో  అవగాహనా పెంచుకోవాలని  త్రాగు నీరు వృధా చెయ్యకుండా  మీ చుట్టుపక్కల  ప్రాంతాలను పరిశుభ్రంగా  ఉంచుకోవలని అయన అన్నారు   ఈ సందర్బంగా  మండలంలో జరిగిన రక్షణ మంచి నీటి పధకంలో  విజయవంతంగా  పూర్తి చేసిన సందర్బంగా  అభినందిస్తూ  జల్ అర్పణ దివాస్  కింద మొదటగా ఎన్నికైనందుకు  హ్యాండలింగ్ ఓవర్ లెటర్ ను అందచేశారు  ఈ కార్యక్రమంలో  ఏ. ఈ సుమాంజలి, పంచాయతీ  డెవలప్మెంట్  ఆఫిసర్  ఎస్. కె. ఎం. డి  హుస్సేన్ భాష, పంచాయతీ మాజీ సర్పంచ్  వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు  వేమిరెడ్డి రవి శేఖర్ రెడ్డి,  గ్రామస్తులు  మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular