కోట స్వర్ణసాగరం మార్చి 29
కోట మండలం కోట పట్టణం లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్.వి ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటీ వెంకట కృష్ణయ్య ఆధ్వర్యంలో ఫౌండేషన్ సొంత నిధులతో ప్రజల సౌకర్యార్థం త్రాగునీటి చలివేంద్రంను ఆదివారం ప్రారంభించారు.ఈ చలివేంద్రం ప్రారంభోత్సవానికి కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.మొదట కోట ఎస్సై పవన్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం ఆర్ వి ఫౌండేషన్ సభ్యులు ఎస్సై పవన్ కుమార్ కు పూలమాలు శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.అనంతరం ఎస్సై పవన్ కుమార్ చేతుల మీదుగా చలివేంద్రంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కోట ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ వెంకట కృష్ణయ్యను అభినందించారు.కోట వాకాడు చిట్టమూరు 3 మండలాలకి ప్రధాన కూడలి అయిన కోట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వేసవి కాలం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.ఇంకా ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలతో ఆర్ వి ఫౌండేషన్ ముందుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ వి ఫౌండేషన్ సభ్యులు పురిణి సుబ్రహ్మణ్యం,ఐ.శ్రీనివాసులు, మీజూరు మల్లికార్జున రావు,కురేసీ కిరణ్ కుమార్ పి శ్రీనివాసులు,పుచలపల్లి రమణయ్య,రాయపు కోటేశ్వరరావు, చెన్నకేశవులు,హర్ష,బి టి ఎ నాయకులు ఐ.వి రమణయ్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



