ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్కాలం కన్న విప్లవం మాన్య శ్రీ కన్సీరాం....బహుజన యూత్ ఫోర్స్

కాలం కన్న విప్లవం మాన్య శ్రీ కన్సీరాం….బహుజన యూత్ ఫోర్స్

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 15

కాలం కన్నటువంటి విప్లవం మాన్యశ్రీ కాన్సీరాం అని బహుజన యూత్ ఫోర్స్ నాయకులు పేర్కొన్నారు.కోట మండలం కోట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కాన్సిరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాన్యశ్రీ కాన్సిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్సు నాయకులు దాసరి అశోక్ కాంబ్లే,మీజూరు మల్లికార్జునరావు మాట్లాడుతూ బహుజనుల ఐక్యత అభివృద్ధి కోసం బహుజన సమాజ్ పార్టీని స్థాపించి అణగారిన వర్గాల సామాజిక, రాజకీయ చైతన్యం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహావీరుడు మాన్యశ్రీ కాన్సీరామ్ అని అన్నారు.ఆయన బహుజన సమాజం, దళితులు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషిని,”కులాన్ని నిర్మూలిద్దాం-బహుజన సమాజాన్ని నిర్మిద్దాం” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు కాన్సిరాం అని,బహుజనులలో రాజకీయ చైతన్యాన్ని నింపే యోజనతో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి బహుజనుల హక్కుల కోసం పోరాటాలు చేశారన్నారు.పాలితులుగా ఉన్న చిన్న కులాలను పాలకులుగా మార్చేందుకు ఆయన చేసిన కృషిని గురించి తెలిపారు. బహుజనులను అనచివేస్తున్న కుల వివక్షను ఎదిరించి బలహీన వర్గాలను బలమైన బహుజన శక్తిగా పరివర్తన చేసేందుకు కృషి చేసిన మహావీరుడు కాన్సిరాం ఆయన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో బహుజన యూత్ ఫోర్స్ నాయకులు కర్లపూడి వెంకట రమణయ్య,కనుపూరు కృష్ణయ్య, మీజురు మల్లికార్జున రావు,దార్ల ఏడుకొండలు,కుదురు సూర్య,శంకర్, మీజూరు మురళీ,జోరేపల్లి తేజ,లాయర్ అశోక్ కాంబ్లే,సలవాది ప్రశాంత్,సమాజ చైతన్య సమితి నాయకులు బందిల రంగనాథ్,పంట్రంగం వసంత్,యనాటి మస్తాన్ అంబేద్కర్ యూత్ సేవా సమితి సభ్యులు పల్లం రాజశేఖర్,తూపిలి వినోద్,తూపిలి నిరంజన్,బందిల గౌతమ్, తేరూరు సంతోష్,బల్లి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular