ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్కోటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

కోటలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 29

కోట మండలం కోటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ ఆదేశాలు మేరకు మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి,జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం భారీ కేకు కట్ చేసి అందరికి పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆదేశానుసారం గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పండుగ వాతావరణం నెలకొన్నదని తెలిపారు.పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని,నేటికీ అదే స్ఫూర్తితో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించారని ఈ నాటికి ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నారని తెలిపారు.బడుగు బలహీన వర్గాలకోసం అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారని,ఆ పథకాల వలన ఎందరో పేద ప్రజలు లబ్ది పొందారని అన్నారు.తెలుగుగంగ పథకం పెట్టి మెట్ట ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారని అన్నారు.ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి,వాకా విజయ భాస్కర్ రెడ్డి, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి,గండవరం సుష్మా రెడ్డి,పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి,మర్రి పోలయ్య,మీజూరు మల్లికార్జున రావు,దారా సురేష్,షేక్ శంషుదీన్,తిరుమలశెట్టి కోటేశ్వరరావు, తిరుమూరు మురళి,ఇన్నమాల అనూక్,తల్లం శ్రీనివాసులు,సుహాసిని,పోలమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular