ePaper
Wednesday, July 29, 2026
Homeఎడిటోరియల్మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఎంతో ఆదర్శనీయం

మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఎంతో ఆదర్శనీయం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 8

మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ తరపున కోట ముస్లిం వీధిలో మృతి చెందిన షేక్ ముక్తియార్ కుటుంబానికి ట్రస్ట్ సభ్యులు 5000 రూపాయల ఆర్ధిక సహాయం చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ అథ్యక్షులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి మాట్లాడుతూ 2026 సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి తన నేతృత్వంలో ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందని ఈ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతానికి కోట పంచాయతీ పరిధిలో ఎవరైనా పేద కుటుంబాల్లో వ్యక్తి చనిపోతే 5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను  చేపడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టే పరిధిని విస్తరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈనేపథ్యంలో కోట పట్టణ ప్రజలు మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ సేవలు పలువురికి ఆదర్శప్రాయంగా ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు తీగల సురేష్ బాబు తూపిలి రాధాక్రిష్ణారెడ్డి,మర్రి అనీల్,బండారు క్రిష్ణయ్య,పాలెపు సుధీర్ కుమార్ రెడ్డి,5వ వార్డు సభ్యుడు షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular