ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 21

ముస్లిం సోదర సోదరీమణులకు,జిల్లా ప్రజలందరికి టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అందరు ప్రశాంత వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు.పవిత్ర రంజాన్ మాసం మానవత్వం,సహనం,దానధర్మాల ప్రాముఖ్యతను తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు.అల్లా కృపతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొనాలని,ప్రజలు ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలని,ప్రజలు ఐక్యంగా,సౌభ్రాతృత్వంతో జీవించాలని ఆకాంక్షించారు.క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని అన్నారు.పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుకని మనిషిలోని చెడు భావనల్ని,అధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపే ఈ పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులందరు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికి షేక్ జలీల్ అహ్మద్ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular