ముస్లిం పెద్దలను సత్కారించి మహిళలకు చీరలు పంపిణి చేసిన మేఘాలదేవి
కొయ్యలగూడెం స్వర్ణసాగరం
రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్దలతో అల్లాని పూజిస్తూ, ఇతరుల పట్ల ప్రేమతో ఉంటారని టిడిపి మహిళా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు, కొయ్యలగూడెం లో ఆమె నివాసం వద్ద గురువారం ముస్లిం పెద్దలను గౌరవిస్తూ జామియా మస్జిద్ మాజీ ప్రెసిడెంట్ సయ్యద్ బాజీని, ప్రస్తుత జామియా మస్జీద్ ప్రెసిడెంట్ రియాజ్ ఖాన్ ను, మస్జిద్ గురువులు మహమ్మద్ గుఫ్రన్ సాహెబ్ లను సత్కరించారు,ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు,ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ నెలలో ముస్లిం సోదరీ సోదరులు ఎంతో పవిత్రతతో ఉపవాస దీక్షలు చేపడతారని, కుల మతాలకు అతీతంగా అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేస్తారని ఆమె తెలిపారు,అనంతరం ముస్లిం సోదరి, సోదరులకు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ వైస్ ప్రెసిడెంట్ మక్బుల్, సెక్రెటరీ సయ్యద్ మోహిద్దిన్, ట్రెజరర్ గాలిబ్, రియాజ్, ఫరీద్, రెహమాన్, జానీ , మహిళలు అత్యధికంగా పాల్గొన్నారు.



