ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ తెలుగు యువత అధికారి ప్రతినిధి ధనుంజయ్, గ్రామస్తులు
ఎంపీటీసీ,జెడ్పిటిసి అభ్యర్థులను గెలిపించాలంటూ ఇంటింటి కరపత్రాల పంపిణి
గెలుపే లక్ష్యంగా ప్రచారంలో హోరెత్తిన పసుపుదళం
స్వర్ణసాగరం వాకాడు
మండల పరిధిలోని నిడుగుర్తి సెగ్మెంట్ లోని వల్లమేడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి దువ్వూరు మధుసూదన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డిని శాలువా,పూలమాలతో నియోజకవర్గ తెలుగు యువత అధికారి ప్రతినిధి మీజురు ధనుంజయ్ ఘనంగా సత్కరించారు.అనంతరం తీన్మార్ డప్పులతో బాణాసంచాల నడుమ ఇంటింటికి ప్రచారం కార్యక్రమంలో కరపత్రాలు పంచుతూ ఎంపీటీసీ అభ్యర్థి జడ్పిటిసి అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మండల ప్రజలకు అందుబాటులో ఉంటామని అలాగే నినుగుర్తి పంచాయతీలోని ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండి వారికి ప్రధాన సమస్య అయిన త్రాగునీరు విద్యుత్ ఉపాధి ఒంటి సమస్యలపై పరిష్కారం చూపిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తీపలపూడి రమణయ్య, మాజీ సర్పంచ్ మీజూరు నాగరాజు,మాజీ సర్పంచ్ మల్లాపు నాగరాజు, మాజీ మహిళా అధ్యక్షురాలు సునీత, యువ నాయకులు అన్వేష్, నాగరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.



