జడ్పీటీసీ, ఎంపీటీసీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని మనవి
అభివృద్దే లక్ష్యం గా ఎన్నికల ప్రచారం
స్వర్ణసాగరం వాకాడు
వాకాడు మండలంలో స్థానిక ఎన్నికల ప్రచారం చివరి రోజు జోరుగా సాగింది. వాకాడు సెగ్మెంట్-2 వైసీపీ పార్టీ నాయకులూ సంగీతం భాస్కర్ సతీమణి ఎంపీటీసీ అభ్యర్థి సంగీతం మానస బీసీ కాలనీ, పాత సెంటర్ తదితర ప్రాంతాల్లో ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 వ తేదీన జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఓటర్లను కోరారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వత పరిష్కారం చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగీతం సంగీతం శివ, షేక్ షాహుల్, షేక్ సిరాజ్ తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



