టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల సమావేశం విజయవంతం
కోట స్వర్ణసాగరం, జూలై 24:
కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం 4.0 కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ,విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రగతి,హాజరు శాతం,పరీక్షల ఫలితాలు,నేర్చుకునే సామర్థ్యం వంటి అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల చదువుపై ఇంటి వద్ద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యాసానికి సంబంధించిన సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకున్నారు.పాఠశాల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల,విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలపై కూడా చర్చించారు.విద్యా రంగ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు,టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



