విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరం-జలీల్ అహ్మద్
కోట స్వర్ణసాగరం జూలై 24:
కోట మండలం కోటలోని బీసీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ సరిత రోజిలిన్ ఆధ్వర్యంలో మెగా పీటీఎం 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తహసీల్దార్ జయ జయ రావు,టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్,మద్దాలి సర్వోత్తమ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అతిథులు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ,విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు కలిసి పనిచేయడం ఎంతో కీలకమని అన్నారు.పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రగతి, క్రమశిక్షణ,వ్యక్తిత్వ వికాసంపై తల్లిదండ్రులు నిరంతరం శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలు,విద్యార్థుల అభ్యున్నతికి అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రిన్సిపాల్ సరిత రోజిలిన్ మాట్లాడుతూ,మెగా పీటీఎం 4.0 ద్వారా విద్యార్థుల విద్యా పురోగతి,హాజరు, అభ్యాస నైపుణ్యాలు,ఆరోగ్యం,భవిష్యత్తు లక్ష్యాలపై తల్లిదండ్రులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను,వారి విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రులు కూడా పాఠశాల నిర్వహణ, బోధన విధానాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, విద్యార్థుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



