♦️విద్యార్థులతో కలిసి భోజనం చేసిన టీడీపీ నాయకులు,చిట్టేడు పిఎసిఎస్ చైర్మన్ చాపల శ్రీనివాసులు
🔶విద్యా వికాసానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీలకమని సూచన
కోట స్వర్ణసాగరం,జూలై 24:
కోట మండలం కేశవరం పంచాయతీ పరిధిలోని రాఘవాపురం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేటీఎం 4.0 కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,చిట్టేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్ శ్రీ చాపల శ్రీనివాసులు పాల్గొని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా పురోగతి,హాజరు,క్రమశిక్షణ,అభ్యాస సామర్థ్యం తదితర అంశాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమీక్ష నిర్వహించారు.ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు నిరంతరం పరస్పర సహకారంతో ముందుకు సాగాలని కార్యక్రమంలో పిలుపునిచ్చారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో చాపల శ్రీనివాసులు విద్యార్థులతో కలిసి పాఠశాలలో భోజనం చేశారు.విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి చదువులు, భవిష్యత్ లక్ష్యాలు,పాఠశాలలోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.భోజనం నాణ్యతను పరిశీలించి,ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మెగా పేటీఎం 4.0 వంటి కార్యక్రమాలు తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని,విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు,గ్రామ పెద్దలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.



