ePaper
Wednesday, July 29, 2026
Homeఎడిటోరియల్ఎస్సీ గురుకులం మూసివేతపై బి.వై.ఎఫ్- బీఎస్పీ ఫైర్

ఎస్సీ గురుకులం మూసివేతపై బి.వై.ఎఫ్- బీఎస్పీ ఫైర్

📰 Generate e-Paper Clip

🔵వెంటనే పునఃప్రారంభించాలి లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్రభుత్వానికి బీఎస్పీ హెచ్చరిక

కోట స్వర్ణసాగరం, జూలై 24:

కోట మండలంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేతను నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నెల్లూరు జిల్లా కమిటీ నాయకులు,బహుజన యూత్ ఫోర్స్ నాయకులతో కలిసి శుక్రవారం పాఠశాలను సందర్శించి తీవ్ర నిరసన తెలిపారు.దళిత,బహుజన విద్యార్థుల విద్యా హక్కులను కాలరాసే చర్యగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు.అనంతరం కోటలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు,వెంటనే గురుకుల పాఠశాలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బీఎస్పీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉధృత ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి షోడవరం సుధాకర్,నెల్లూరు జిల్లా అధ్యక్షులు బి.శ్రీరాం,నెల్లూరు పార్లమెంటు ఇంచార్జ్ లు చిరమన సుధాకర్ , కడియంపాటి అశోక్,జిల్లా ఉపాధ్యక్షులు టి.కృష్ణ,జిల్లా కార్యవర్గ సభ్యులు దాసరి సుందరం,కోవూరు నియోజకవర్గ అధ్యక్షులు కడియంపాటి అనిల్,గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు పామలతేరి మురళీ యాదవ్, ఇంచార్జి మీజూరు సుబ్రమణ్యం,ఉపాధ్యక్షులు ఐవీ రమణయ్య,ట్రెజరర్ కర్లపూడి పోలయ్య,కోట మండల కార్యదర్శి మురారి రామయ్య,బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరాం శివప్రసాద్ (శంకర్)గౌరవ సలహాదారులు ముమ్మడి వెంకట సుబ్బయ్య, కనుపూరు కృష్ణయ్య, లెక్చరర్ నాగేంద్ర,లీగల్ అడ్వైజర్ దాసరి అశోక్  కాంబ్లే,మీడియా కో ఆర్డినేటర్ పాకం చెన్నకేశవలు,కో కన్వీనర్లు శ్రీరాం రవి,సురేంద్ర,బందిల గౌతమ్,శ్రీనాథ్, రాజశేఖర్,పాకం గౌతమ్,ఇలియాజ్,అరుణ్, కర్లపూడి.హరికృష్ణ,హరీష్,ప్రవీణ్,జయ చంద్ర, జోషి,మామిడిపూడి కస్తురయ్య,పూర్వ విద్యార్థి కుంచం వెంకట రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular