ePaper
Wednesday, July 29, 2026
Homeఎడిటోరియల్ఎస్సీ గురుకులాల మూసివేతపైపామలతేరి మురళి యాదవ్ ఫైర్

ఎస్సీ గురుకులాల మూసివేతపైపామలతేరి మురళి యాదవ్ ఫైర్

📰 Generate e-Paper Clip

🔷దళిత విద్యపై దాడులు సహించం సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ముట్టడికి పిలుపు

♦️బహుజన సమాజం ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని పామలతేరి మురళి యాదవ్ పిలుపు

కోట స్వర్ణసాగరం జులై 25

రాష్ట్రంలో ఎస్సీ గురుకులాలను మూసివేయడం దళిత విద్యార్థుల భవిష్యత్తుపై దాడేనని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు పామలతేరి మురళి యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు.ఈ నేపథ్యంలో శనివారం కోటలో మురళి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అంబేడ్కర్ చూపిన విద్యా మార్గంలో దళితులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ సామాజిక,రాజకీయ చైతన్యం సాధిస్తుండటాన్ని కొందరు ఆధిపత్య వర్గాలు జీర్ణించుకోలేక గురుకుల విద్యా వ్యవస్థను బలహీనపరిచే కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.ఇప్పటివరకు దళితులు తమ హక్కులు,రాయితీల కోసం పోరాడితే,  ఇప్పుడు రాజ్యాధికార లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని,ఈ పరిణామాలను అడ్డుకోవడానికే గురుకుల విద్యా వ్యవస్థపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.రాష్ట్రంలో ఇప్పటికే మూడు ఎస్సీ గురుకులాలను మూసివేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.కోటలో బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో గురుకులాల పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమాన్ని అభినందించిన మురళి యాదవ్, ఈ పోరాటంలో పూర్వ విద్యార్థులు,ప్రస్తుత విద్యార్థులు,వారి తల్లిదండ్రులు,యావత్ బహుజన సమాజం ఒక్కటై ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ఉద్యమానికి బహుజన సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని గురుకులాల పరిరక్షణకు గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు.గురుకులాల పునరుద్ధరణ వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular