ePaper
Wednesday, July 29, 2026
Homeఎడిటోరియల్టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎన్సీఆర్ నగర్ కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ

టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎన్సీఆర్ నగర్ కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ

📰 Generate e-Paper Clip

♦️టీడీపీ నాయకుడు షేక్ జలీల్ అహ్మద్ డ్రీమ్ ప్రాజెక్టుకు శ్రీకారం

♦️కోట ప్రాంత అభివృద్ధికి ఈ కల్వర్టు ఒక మైలురాయి జలీల్ అహ్మద్

♦️ప్రజల రాకపోకలకు శాశ్వత పరిష్కారం –ఎన్సీఆర్ నగర్‌కు తీపి జ్ఞాపకంగా నిలిచే కల్వర్టు

కోట స్వర్ణసాగరం జూలై 26

కోట మండల కేంద్రంలోని ఎన్సీఆర్ నగర్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై నిర్మించనున్న కల్వర్టు పనులకు ఆదివారం టీడీపీ నాయకుడు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.స్థానిక ప్రజల చిరకాల కోరిక నెరవేరుతున్న సందర్భంగా ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కోటలో ఈ కల్వర్టు నిర్మాణం చాలా అవసరమైనదని అలవాటు నిర్మాణానికి ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కల్వర్టు కోసం కృషి చేసిన షేక్ జలీల్ అహ్మద్ కు అభినందనలు తెలిపారు. అనంతరం టిడిపి నేత షేక్ జలీల్ అహ్మద్  మాట్లాడుతూ,ఎన్సీఆర్ నగర్ కల్వర్టు నిర్మాణాన్ని తాను డ్రీమ్ ప్రాజెక్టుగా భావించి ప్రత్యేక చొరవతో ముందుకు తీసుకువచ్చానని తెలిపారు.ఈ కల్వర్టు నిర్మాణంతో వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, వాహనదారులు,విద్యార్థులు,పాదచారులకు సురక్షితమైన రాకపోకలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.కోట పట్టణ మరియు ఎన్సీఆర్ నగర్ ప్రాంత అభివృద్ధిలో ఈ కల్వర్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని,రానున్న తరాలకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆయన అన్నారు.ప్రజల అవసరాలే తమకు ప్రాధాన్యమని,భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి కోట ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు,ఎన్సీఆర్ నగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కల్వర్టు నిర్మాణం ప్రారంభం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.ప్రజలు గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కు,టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డికి,షేక్ జలీల్ అహ్మద్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు షేక్ శంసుద్దీన్,దారా సురేష్, ఏఎంసీ చైర్మన్ మర్రి ప్రమీల,టిడిపి నాయకులు షేక్ నౌషాద్,ముని రాజా,మీజూరు మల్లికార్జునరావు,రవి వర్మ,వంశీ,తదితరులు టీడీపీ నాయకులు,కార్యకర్తలు కోట పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular