🔷ప్రజల కష్టసుఖాల్లో పార్టీ అండగా ఉంటుంది అంటూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం
కోట స్వర్ణసాగరం జూలై 26:
గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ సమన్వయకర్త బూదురు గురవయ్య మానవీయతను చాటుతూ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.కోట మండలం గూడలి గ్రామానికి చెందిన మాలేపాటి కృష్ణమ్మ ఆకస్మిక మరణించిన విషయం తెలుసుకున్న వెంటనే ఆదివారం ఆమె నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.మృతురాలి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన గురవయ్య,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ విషాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.గూడలి వైఎస్ఆర్‌సీపీ నాయకులు వేమారెడ్డి షనీల్ రెడ్డి,గూడలి ఉపసర్పంచ్ పల్లెమల్లు విజయసారధి రెడ్డి సమాచారం అందించిన వెంటనే స్పందించి గ్రామానికి చేరుకోవడం గురవయ్య సేవాభావానికి నిదర్శనమని గ్రామస్తులు,పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.ఇటీవలే గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన బూదురు గురవయ్య,ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తున్నారని నాయకులు కొనియాడారు.సమాచారం అందగానే ఆలస్యం చేయకుండా స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించడం ఆయన ప్రజల పట్ల ఉన్న బాధ్యతను ప్రతిబింబిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్‌సీపీ నాయకులు,కార్యకర్తలు, మృతురాలి కుటుంబ సభ్యులు,బంధువులు, గ్రామ పెద్దలు పాల్గొని మృతురాలికి నివాళులర్పించారు.



