ePaper
Wednesday, July 29, 2026
Homeఎడిటోరియల్తెలుగుదేశం కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం

తెలుగుదేశం కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జులై 27

తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి,ప్రజా సంక్షేమం సాధ్యమని కోట క్లస్టర్ ఇన్‌చార్జ్ మద్దాలి సర్వోత్తమరెడ్డి,కో క్లస్టర్ ఇన్‌చార్జ్ తీగల సురేష్‌ బాబు,మాజీ కోట మండల పరిషత్ అధ్యక్షుడు నల్లపరెడ్డి వినోద్‌ కుమార్‌ రెడ్డి,కోట యూనిట్ ఇన్‌చార్జ్ తూపిలి రాధాకృష్ణారెడ్డి పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు 45 రోజులపాటు నిర్వహించనున్న ఇంటింటికీ తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని కోట మండలం 42వ యూనిట్ పరిధిలోని 201వ బూత్‌లో ఉన్న కోట నార్త్ గిరిజన కాలనీలో మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొంటూ,వృద్ధులు,వితంతువుల పింఛన్లను రూ.3,000 నుంచి రూ.4,000కు, వికలాంగుల పింఛన్లను వైకల్య శాతాన్ని బట్టి రూ.6,000 నుంచి రూ.15,000 వరకు పెంచి అందజేస్తోందని తెలిపారు.మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు మూడు విడతల్లో రూ.20 వేల అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం, రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం,చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద ఏటా రూ.25 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు.గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రహదారులను విస్తృతంగా మరమ్మతు చేస్తూనే,రాష్ట్రవ్యాప్తంగా వేల కిలోమీటర్ల మేర కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కొత్త పరిశ్రమలను తీసుకొస్తూ,పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి,సంక్షేమ బాటలో నడిపిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోట రెండో ఎంపీటీసీ సభ్యుడు షేక్ మొబీన్ బాషా,జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రి పోలయ్య,మండల పార్టీ ఉపాధ్యక్షులు పాలెపు సుధీర్ కుమార్ రెడ్డి, మర్రి అనీల్,మాజీ సర్పంచులు ఇండ్ల వెంకటరమణమ్మ,బొర్రా పద్మమ్మ,రాయపు పోలయ్య,పురం హరీష్,రాయపు రాకేష్, మీజూరు రవికుమార్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular