ePaper
Saturday, September 12, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమిట్టవడ్డిపల్లి నుంచి వెలిగిన వైద్య తార – డా. పులకంటి విక్రమ్

మిట్టవడ్డిపల్లి నుంచి వెలిగిన వైద్య తార – డా. పులకంటి విక్రమ్

📰 Generate e-Paper Clip

స్వర్ణసాగరం డక్కిలి (మార్చి 7)
తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబలూరు పంచాయితీ మిట్టవడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు పులకంటి విక్రమ్ ఎంబీబీఎస్ పట్టా సాధించి గ్రామానికి గర్వకారణంగానిలిచారు.సాధారణ కుటుంబంలో జన్మించిన విక్రమ్ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచి,వైద్య రంగంలో ముందుకు రావాలనే, లక్ష్యంతో కృషి చేశారు.తన కష్టపడి చదువుకునే స్వభావంతో ఉన్నత విద్యలో,మెరుగైన ఫలితాలు సాధించి ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్‌గా నిలిచారు.డక్కిలి మండలం లో చిన్న గ్రామమైన మిట్టవడ్డిపల్లి నుంచి వైద్య విద్యను, పూర్తి చేసి డాక్టర్‌గా ఎదగడం గ్రామ ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. డా. పులకంటి విక్రమ్ సాధించిన ఈ విజయాన్ని గ్రామ పెద్దలు, యువత, స్నేహితులు హర్షిస్తూ ఆయనను అభినందించారు. ఆయన విజయం గ్రామ యువతకు ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ, మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని, గ్రామస్తులు ఆకాంక్షించారు. మిట్టవడ్డిపల్లి నుంచి వెలిగిన వైద్య తారగా డా. పులకంటి విక్రమ్ పేరు జిల్లాలో ప్రఖ్యాతి గడించాలని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డా. పులకంటి విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ మా తాత పులకంటి. చిన్నబ్బయ్య కోరిక ఈ నాటికి నెరవేరింది. ప్రజలకు సేవ చెయ్యాలని మా తాత కోరిక. అదేవిదంగా మా చిన్నానలు పులకంటి. రామరావు, సురేష్, జనార్ధన్, మా తండ్రి ఈశ్వరయ్య, మా కుటుంబ సభ్యులు యొక్క ప్రేరణ ఎంతో వుంది అని తెలియజేసారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular