ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపం-తెలుగుదేశం పార్టీ..నెల్లూరు మోహన్ రెడ్డి

తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపం-తెలుగుదేశం పార్టీ..నెల్లూరు మోహన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 29

తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపం తెలుగుదేశం పార్టీ అని టీడీపీనేత నెల్లూరు మోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామంలో నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.టీడీపీ గ్రామ పార్టీ నాయకులు అందరు మోహన్ రెడ్డితో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరణ చేసి అందరికి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ పసుపు జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తకు,నాయకుడికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.తెలుగుదేశం పార్టీ కేవలం పార్టీ కాదు తెలుగు వారి ఆత్మగౌరవం అని అన్నారు. నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా పేదవాడికి కూడు గూడు అందించే సిద్ధాంతానికి తాము కట్టుబడి ఉంటామని అన్నారు.తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా తెలుగుదేశం పార్టీ పసుపు జెండా అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ముంగర మురళి రెడ్డి,గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు కోటా వెంకటేశ్వర్లు,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి మట్టిగుంట సురేంద్ర బాబు,స్థానిక ఎంపిటిసి  నారాయణ,సీనియర్ నాయకులు శానంపూడి గోపాల్ రెడ్డి,కందల రాధాకృష్ణారెడ్డి,గూడూరు రమేష్ రెడ్డి,కట్ట శ్రీ శంకర్ రెడ్డి,నేదురుమల్లి కిరణ్ కుమార్ రెడ్డి,బూత్ కన్వీనర్లు గుండాల సుబ్రహ్మణ్యం,చేవూరు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular